రాప్తాడు విద్యార్థినిపై దాడి ఘటన: ప్రభుత్వ తీరును నిలదీసిన వైఎస్ జగన్
రిపోర్టర్: రమేష్
స్థలం: అనంతపురం
అనంతపురం జిల్లా రాప్తాడు ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థినిపై జరిగిన దాడి ఘటనపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో మహిళలు, బాలికలకు భద్రత కరవైందని ఆయన మండిపడ్డారు. పాఠశాలల్ లో చదువుకుంటున్న ఆడపిల్లలపై ఎలక్ట్రిక్ రంపంతో దాడి జరిగే పరిస్థితి రావడం దారుణమని, గంజాయి, మద్యం విచ్చలవిడిగా లభించడమే ఇలాంటి అరాచకాలకు కారణమని ఆయన ధ్వజమెత్తారు.