'వర్షాలు కురవాలని..': గోవర్ధనగిరిలో వరద పాశం పూజలు
రిపోర్టర్: Alfa News Desk
స్థలం: అక్కన్నపేట
సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం గోవర్ధనగిరి గ్రామంలోని సంజీవరాయిని గుట్టపై వర్షాలు కురవాలని గ్రామస్తులు వరద పాశం పూజా కార్యక్రమాన్ని నిర్వహించారు. వర్షాలు సమృద్ధిగా కురిసి పంటలు పండాలని ఆకాంక్షిస్తూ మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని బతుకమ్మ ఆడుతూ ప్రార్థించారు. యాదవ, కురమ కులస్తులు కలిసి నైవేద్యం వండి గుండంలో సమర్పించి, ఆ నీటిని పొలాలు, పశువులపై చల్లితే మంచి జరుగుతుందని విశ్వసిస్తున్నట్లు తెలిపారు.