సామాన్యులపై మరో భారం: త్వరలోనే నిత్యవసరాలు మరియు సబ్బుల ధరల పెంపు

రిపోర్టర్: శ్రీనివాస్ స్థలం: న్యూఢిల్లీ

నిత్యవసర వస్తువుల ధరలు విపరీతంగా పెరుగుతున్న తరుణంలో సామాన్యులపై మరో భారం పడనుందని క్రైసిల్, ఎలరా క్యాపిటల్ మరియు కొటక్ నియో సంస్థల విశ్లేషకులు వెల్లడించారు. క్రూడ్ చమురు ధరలు పెరగడం మరియు ముడిసరుకుల వ్యయం భారీగా ఎగబాకడంతో పాటు వర్షాభావ పరిస్థితుల కారణంగా సబ్బులు, టూత్పేస్ట్లు, వంటనూనెలు, చాక్లెట్ల వంటి ఎఫ్ఎంసీజీ ఉత్పత్తుల ధరలను పెంచేందుకు కంపెనీలు నిర్ణయించాయి. దీంతో డిసెంబర్ నుంచి టెలిఫోన్ బిల్లులు సైతం పెరిగే అవకాశం ఉందని అంబిత్ క్యాపిటల్ అంచనా వేసింది.