ముస్లిం దేశాల నేతలతో దోస్తీ దేశంలో మసీదుల కూల్చివేతా
రిపోర్టర్: వెంకట్
స్థలం: భారతదేశం
ఒకవైపు విదేశాల్లో ముస్లిం దేశాల నాయకులతో ప్రధాని నరేంద్ర మోదీ ఆప్యాయంగా ఆలింగనం చేసుకుంటున్నారని, మరోవైపు దేశంలో మసీదులు, సమాధులను కూల్చివేస్తున్నారని ఎంఐఎం తీవ్ర స్థాయిలో మండిపడింది. ఈ వైఖరి వెనుక ఇంతటి కక్ష, విద్వేషం ఎందుకని కేంద్ర ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీసింది. దేశంలోని మైనారిటీల పట్ల అనుసరిస్తున్న విధానాలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఈ వ్యాఖ్యలు చేసింది.