విజయవాడలో భారీ వర్షం.. జలమయమైన ప్రధాన రహదారులు
రిపోర్టర్: భాస్కర్
స్థలం: ఎన్టీఆర్ జిల్లా
విజయవాడ నగరంలో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. లోతట్టు ప్రాంతాలు, ప్రధాన రహదారులు జలమయమయ్యాయి. మోకాళ్ల లోతు నీరు నిలవడంతో వాహనదారులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలో మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తు నిర్వహణ సంస్థ హెచ్చరించింది.