గంభీరావుపేటలో చెట్ల పొదలతో వాహనదారులకు ప్రమాదాల ముప్పు
రిపోర్టర్: నరేష్
స్థలం: రాజన్న సిరిసిల్ల జిల్లా
రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలంలో మల్లారెడ్డిపేట నుంచి గంభీరావుపేటకు వెళ్లే రహదారి వెంట చెట్ల పొదలు విపరీతంగా పెరగడంతో మూలమలుపుల వద్ద వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. గంభీరావుపేట-లింగన్నపేట తాత్కాలిక రహదారి వరదలకు దెబ్బతినడంతో ప్రజలు ఈ మార్గాన్నే వినియోగిస్తున్నారు. రోడ్డుకు ఇరువైపులా పెరిగిన పొదల కారణంగా ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించక ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని, రాత్రివేళల్లో పరిస్థితి మరింత దయనీయంగా మారిందని వాహనదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి చెట్లను తొలగించాలని కోరుతున్నారు.