గురుద్వారాలో రాజకీయ నిరసనలపై డీఎస్జీఎంసీ చీఫ్ హర్మీత్ సింగ్ కల్కా ధ్వజం

రిపోర్టర్: ప్రసాద్ స్థలం: ఢిల్లీ

ఢిల్లీలోని గురుద్వారా బంగ్లా సాహిబ్లో నిరసనల పేరుతో పవిత్ర స్థలాన్ని రాజకీయాలకు వాడుతున్నారంటూ ఆమ్ ఆద్మీ పార్టీ నేతలపై ఢిల్లీ సిక్కు గురుద్వారా నిర్వహణ కమిటీ అధ్యక్షుడు హర్మీత్ సింగ్ కల్కా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్తో పాటు ఇందుకు కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ ఆయన ఢిల్లీ పోలీసు కమిషనర్కు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.