అమెరికా విమానాశ్రయంలో ముహమ్మద్ యూనస్కు ఘోర అవమానం: టెర్రరిస్ట్ అంటూ నిరసన
రిపోర్టర్: విజయ్
స్థలం: New York
అమెరికాలోని న్యూయార్క్ విమానాశ్రయంలో బంగ్లాదేశ్ మాజీ సలహాదారు ప్రొఫెసర్ ముహమ్మద్ యూనస్కు తీవ్ర నిరసన ఎదురైందని ఎన్డీటీవీ వర్గాలు వెల్లడించాయి. జాన్ ఎఫ్ కెన్నెడీ ఎయిర్పోర్టులో వీల్చైర్లో వస్తున్న ఆయనను ప్రవాస బంగ్లాదేశీయులు అడ్డుకున్నారు. బంగ్లాదేశ్లో రాజకీయ సంక్షోభం, ప్రజాస్వామ్యాన్ని అణచివేయడానికి ఆయనే కారణమంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. నిరసనకారులు టెర్రరిస్ట్ అంటూ నినాదాలు చేయగా, భద్రతా సిబ్బంది వెంటనే స్పందించి ఆయనను సురక్షిత ప్రాంతానికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.