రామోజీ ఫిల్మ్‌సిటీలో వైభవంగా రామోజీ ఫెస్టివ్ సెలబ్రేషన్స్-2026 ప్రారంభం
రిపోర్టర్: హరి
స్థలం: రంగారెడ్డి జిల్లా
ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్‌సిటీలో దసరా, దీపావళి సంబరాలను పురస్కరించుకుని రామోజీ ఫెస్టివ్ సెలబ్రేషన్స్- 2026 ప్రారంభమైనట్లు నిర్వాహకులు తెలిపారు. గురువారం నుంచి నవంబరు 15వ తేదీ వరకు కొనసాగనున్న ఈ వేడుకల్లో భాగంగా ఉదయం 9 నుంచి రాత్రి 9 గంటల వరకు సందర్శకులను అనుమతిస్తామని వారు పేర్కొన్నారు. మ్యూజికల్ గ్లో గార్డెన్, సినిమాటిక్ కార్నివాల్ పరేడ్, విద్యుద్దీపాల ధగధగలు, ఏఐ ఫొటో బూత్‌లు పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయని తెలిపారు.