చెన్నైలో ప్రభుత్వ ఆసుపత్రి ఉద్యోగినిపై పెట్రోల్ పోసి సజీవ దహనం చేయబోయిన నిందితుడు ఎన్‌కౌంటర్

రిపోర్టర్: సురేష్ స్థలం: చెన్నై

చెన్నైలోని పొన్నేరి ప్రభుత్వ ఆసుపత్రిలో రాజేశ్వరి అనే మహిళా ఉద్యోగినిపై ప్రకాష్ అనే వ్యక్తి పెట్రోల్ పోసి నిప్పంటించి పరారయ్యాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన ప్రత్యేక పోలీసులు, నిందితుడిని గాలిస్తుండగా మంగళవారం ఉదయం పోలీసులపై కత్తితో దాడికి యత్నించాడు. దీంతో ఆత్మరక్షణార్థం పోలీసులు జరిపిన కాల్పుల్లో నిందితుడి కాలుకు గాయమవడంతో అదుపులోకి తీసుకున్నారు. తీవ్రంగా గాయపడిన రాజేశ్వరిని మెరుగైన చికిత్స కోసం చెన్నైలోని కీల్పాక్ ఆసుపత్రికి తరలించారు.