వైకాపా కార్యాలయంలో కంటతడి పెట్టిన మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ
రిపోర్టర్: రాజేష్
స్థలం: విజయనగరం
విజయనగరం జిల్లా గరివిడి వైకాపా కార్యాలయంలో జరిగిన సమావేశంలో మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ భావోద్వేగానికి గురై కంటతడి పెట్టారు. జడ్పీ ఛైర్మన్ మజ్జి శ్రీనివాసరావు పార్టీ వీడి తెదేపాలో చేరడంపై నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక ఎన్నికలకు ముందు ఉత్తరాంధ్రలో వైకాపాకు ఇది భారీ షాక్‌గా మారింది.