అన్నదాతలకు తీపి కబురు: రాష్ట్రంలో సాగుకు సోలార్ పంపుసెట్లు

రిపోర్టర్: గోపి స్థలం: హైదరాబాద్

రాష్ట్రంలో వ్యవసాయ రంగానికి పెద్దపీట వేస్తూ సాగుకు సోలార్ పంపుసెట్లను అందించనున్నట్లు టీజీ రెడ్కో సీఎండీ జితేశ్ వీ పాటిల్ స్పష్టం చేశారు. హైదరాబాద్ లో నిర్వహించిన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇప్పటికే మంజూరైన సోలార్ పంపుసెట్ల బిగింపు ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. పీఎం కుసుమ్ పథకం కింద లక్ష్యాలను సాధించేందుకు జిల్లా స్థాయిలో ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకోవాలని ఆయన సూచించారు.