గ్రామాల్లో వైభవంగా వెయ్యేళ్ళ చరిత్ర కలిగిన బొడ్డెమ్మ వేడుకలు
రిపోర్టర్: నరేష్
స్థలం: టేకుమట్ల
రాష్ట్రంలో వెయ్యేళ్ళ చరిత్ర కలిగిన బొడ్డెమ్మ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయని స్థానిక ప్రజలు తెలిపారు. భాద్రపద మాసంలో ప్రారంభమయ్యే ఈ పండుగలో కన్నె పిల్లలు, మహిళలు భక్తిశ్రద్ధలతో పాల్గొని గౌరీదేవిని ప్రత్యేకంగా పూజిస్తారు. పీఠ, గుంట, పందిరి, బాయి, అంతరాల బొడ్డెమ్మలుగా ఐదు రకాలుగా కొలిచే ఈ వేడుకలు ఎంగిలిపూల బతుకమ్మకు ఒక రోజు ముందు వరకు కొనసాగుతాయని నిర్వాహకులు వెల్లడించారు. తొమ్మిది రోజుల పాటు పూజలు నిర్వహించిన అనంతరం బొడ్డెమ్మలను చెరువుల్లో నిమజ్జనం చేస్తారు.