పారిస్ ఫ్యాషన్ వీక్ వేదికపై ఐశ్వర్య రాయ్, సెలిన్ డియాన్ ఆలింగనం

రిపోర్టర్: రాము స్థలం: Paris

ఫ్రెంచ్ రాజధాని పారిస్లో జరిగిన అంతర్జాతీయ ఫ్యాషన్ వీక్ వేదికపై బాలీవుడ్ ప్రముఖ నటి ఐశ్వర్య రాయ్ బచ్చన్, ప్రసిద్ధ గాయని సెలిన్ డియాన్ ఆలింగనం చేసుకున్న క్షణాలు అందరినీ ఆకట్టుకున్నాయని నిర్వాహకులు తెలిపారు. లోరియల్ పారిస్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఇద్దరు ప్రముఖ తారలు ఒకే వేదికపైకి రావడం అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది. ఈ అరుదైన దృశ్యాన్ని సోషల్ మీడియాలో చూసిన అభిమానులు తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తూ వీడియోలను వైరల్ చేస్తున్నారు.