పులివెందులలో ప్రజాస్వామ్యం ఖూనీ: ముఖ్యమంత్రి చంద్రబాబుపై వైసీపీ అధినేత జగన్ ఫైర్
రిపోర్టర్: వెంకట్
స్థలం: Kadapa
కడప జిల్లా పులివెందులలో పోలింగ్ కేంద్రాల్ లో తమ పార్టీ ఏజెంట్లను అడ్డుకుంటున్నారని వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి మండిపడ్డారు. పోలీస్ సమక్షంలోనే వైఎస్సార్సీపీ ఏజెంట్లపై దాడులు జరుగుతున్నాయని, సీఎం చంద్రబాబు నాయుడు పాలనలో ప్రజాస్వామ్యం పూర్తిగా ఖూనీ అవుతోందని ఆయన తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఈ అక్రమాలపై తక్షణమే రీపోలింగ్ నిర్వహించాలని డిమాండ్ చేస్తూ, బాధ్యులైన అధికారులను నిలదీస్తామని జగన్ హెచ్చరించారు.