వ్యవసాయ పీజీ ప్రవేశాల కౌన్సెలింగ్ రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ప్రారంభం

రిపోర్టర్: శివ స్థలం: న్యూఢిల్లీ

భారతీయ వ్యవసాయ పరిశోధనా మండలి పీజీ మరియు పీహెచ్డీ ప్రవేశాల కౌన్సెలింగ్ ప్రక్రియను ప్రారంభించినట్లు అధికారులు వెల్లడించారు. అర్హత కలిగిన అభ్యర్థులు అక్టోబర్ రెండు వరకు ఆన్లైన్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకొని ఫీజు చెల్లించాలని సూచించారు. జాతీయ పరీక్షా సంస్థ గతంలో నిర్వహించిన ప్రవేశ పరీక్ష ఫలితాల ఆధారంగా ఈ కౌన్సెలింగ్ జరుగుతుందని స్పష్టం చేశారు. వెటర్నరీ స్ట్రీమ్ మినహా మిగిలిన వ్యవసాయ కోర్సులకు సీట్ల భర్తీ చేపడతామని పేర్కొన్నారు. అక్టోబర్ ఐదున మొదటి విడత సీట్ల కేటాయింపు ఉంటుందని తెలిపారు.