నారాయణపూర్ రిజర్వాయర్ బాధితులకు తగిన న్యాయం చేస్తామన్న ఎమ్మెల్యే సత్యం
రిపోర్టర్: సునీల్
స్థలం: కరీంనగర్
కరీంనగర్ కలెక్టరేట్లో గంగాధర మండలం నారాయణపూర్ గ్రామస్తులతో చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా సమావేశమయ్యారు. నారాయణపూర్ రిజర్వాయర్ ప్రభావంతో ఇబ్బందులు పడుతున్న గ్రామస్తులను ముంపు గ్రామంగా ప్రకటించాలని లేదా ప్రత్యామ్నాయంగా ఇంటి స్థలాలు, ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలని ఎమ్మెల్యే కోరారు. సర్వే వివరాలు పరిశీలించి సమగ్ర నివేదికను ప్రభుత్వానికి అందజేస్తామని కలెక్టర్ తెలిపారు.