యూపీఐ చెల్లింపులపై ఛార్జీల నిర్ణయం తగదన్న కవిడే సురేశ్

రిపోర్టర్: BALUGURI VENKHATAREDDY స్థలం: వలిగొండ

డిజిటల్ యూపీఐ చెల్లింపులపై ఎం.డి.ఆర్. పేరుతో అదనపు ఛార్జీలు విధించే కేంద్ర ప్రభుత్వ నిర్ణయం సరైంది కాదని, దీనిని వెంటనే ఉపసంహరించుకోవాలని డీవైఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు కవిడే సురేశ్ డిమాండ్ చేశారు. వలిగొండ మండలంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఈ నిర్ణయం వల్ల సామాన్య ప్రజలపై, చిన్న వ్యాపారస్తులపై తీవ్ర ఆర్థిక భారం పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు.