దస్తురాబాద్ పెర్కపల్లెలో భక్తిశ్రద్ధలతో ఘనంగా గణేష్ నిమజ్జన వేడుకలు

రిపోర్టర్: Alfa News Desk స్థలం: దస్తురాబాద్

మండలంలోని పెర్కపల్లె గ్రామంలో వినాయక నవరాత్రి ఉత్సవాల ముగింపు సందర్భంగా నిమజ్జన వేడుకలు భక్తిశ్రద్ధలతో సాగాయి. గణనాథుడికి ప్రత్యేక పూజలు నిర్వహించి, డప్పులు, భజనలతో ఊరేగింపుగా నిమజ్జనానికి తరలించారు. యువత సందడి మధ్య మహిళలు చేసిన నృత్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని గణపతి బప్పా మోరియా అంటూ నినాదాలు చేస్తూ వీడ్కోలు పలికారు. ఈ వేడుకలు గ్రామంలో ఆధ్యాత్మిక వాతావరణాన్ని నింపాయి.