తరాలు మారినా భైంసాలో వీడని అయి తాత గణేష్ భక్తి
రిపోర్టర్: సునీల్
స్థలం: భైంసా
నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలోని పురాణ బజార్లో వెలసిన అయి తాత గణేష్కి ఎనభై, తొంభైల దశకం కిడ్స్తో ప్రత్యేక అనుబంధం ఉంది. మహా శెట్టి వారింట్లో గత డెబ్బై ఏడేళ్లుగా గణపతిని ప్రతిష్టించి పూజలు చేస్తున్నారు. ఏటా అలంకరించే అయి తాత బొమ్మలు చిన్నారులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఒకప్పుడు బొమ్మలను చూసినవారే నేడు పిల్లలతో రావడం మధుర జ్ఞాపకమని స్థానికులు తెలిపారు.