రోడ్డు ప్రమాదంలో గాయపడిన యువతిని కాపాడిన కేంద్ర మంత్రి బండి సంజయ్
రిపోర్టర్: ప్రసాద్
స్థలం: సిద్దిపేట
సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం కొడకండ్ల గ్రామ శివారులో జరిగిన రోడ్డు ప్రమాదంలో కారు అదుపుతప్పి డివైడర్ను ఢీకొనడంతో ఆర్టీసీ డ్రైవర్ జయందర్ రెడ్డి కుమార్తె సుప్రీత తలకు తీవ్ర గాయాలయ్యాయి. అదే మార్గంలో వెళ్తున్న కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ప్రమాగాన్ని గుర్తించి, వెంటనే తన సొంత ఎస్కార్ట్ వాహనంలో క్షతగాత్రురాలిని గజ్వేల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి మానవత్వం చాటుకున్నారు.