అమెరికా వేదికగా టాల్హెల్త్ ఫెస్ట్: తెలంగాణ మంత్రులకు ప్రత్యేక ఆహ్వానం

రిపోర్టర్: ప్రవీణ్ స్థలం: హైదరాబాద్

అమెరికాలోని కాలిఫోర్నియా శాన్ డియాగోలో అక్టోబర్ 30, 2026న నిర్వహించనున్న టాల్హెల్త్ ఫెస్ట్ వేడుకకు తెలంగాణ వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ మరియు ఐటీ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబులను విశిష్ట అతిథులుగా ఆహ్వానించినట్లు టచ్-ఎ-లైఫ్ ఫౌండేషన్ నిర్వాహకులు తెలిపారు. ప్రపంచ స్థాయి ఆరోగ్య సంరక్షణ రంగానికి తెలంగాణ కేంద్రంగా మారుతున్న తరుణంలో ఈ సదస్సు ప్రాధాన్యత సంతరించుకుంది.