ఫారం 6 అంశంపై రాహుల్ గాంధీ ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారంటూ సంబిత్ పాత్ర మండిపాటు
రిపోర్టర్: సురేష్
స్థలం: న్యూఢిల్లీ
ఫారం 6 వివాదంపై కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారని బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి సంబిత్ పాత్ర ఆరోపించారు. మంగళవారం ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, సుప్రీంకోర్టు ఫారం 6 ను చట్టవింగా ప్రకటించలేదని స్పష్టం చేశారు. ప్రతిపక్షాలు ఎన్నికల సంఘంపై నిరాధార ఆరోపణలు చేస్తూ రాజ్యాంగ వ్యవస్థలను బలహీనపర్చాలని చూస్తున్నాయని ఆయన తీవ్రస్థాయిలో విమర్శించారు.