గ్రేటర్ నోయిడాలో యువతి ఐఫోన్ ఎత్తుకెళ్లిన దుండగులు
రిపోర్టర్: నరేష్
స్థలం: ఉత్తరప్రదేశ్
ఉత్తరప్రదేశ్ రాష్ట్రం గ్రేటర్ నోయిడా వెస్ట్ లో ఈ-రిక్షాలో ప్రయాణిస్తూ ఆన్లైన్ పేమెంట్ చేస్తున్న శుభి భండారి అనే యువతి కొత్త ఐఫోన్ ను ఇద్దరు దుండగులు మోటార్ సైకిల్ పై వచ్చి లాకెళ్లారు. కొనుగోలు చేసిన కేవలం మూడే రోజులకే ఈ ఘటన జరగడంతో బాధితురాలి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన బరఖ్ పోలీసులు సీసీటీవీ పుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు.