ఉల్లి నిల్వ నష్టాలను అరికట్టేందుకు గోదామ్ సెన్స్ ఆవిష్కరణ
రిపోర్టర్: సురేష్
స్థలం: Nashik
ఉల్లి నిల్వలో నష్టాలను నివారించేందుకు టెక్నాలజీ ఆధారిత గోదామ్ సెన్స్ పరికరాన్ని రూపకల్పన చేసినట్లు ఇన్నోవేటర్ కళ్యాణి షిండే వెల్లడించారు. నాసిక్‌లోని లసల్గావ్కు చెందిన ఆమె, కుటుంబం పడిన కష్టాలను చూసి ఈ అంకుర ఆలోచనకు శ్రీకారం చుట్టారు. ఐవోటీ ఆధారిత ఈ పరికరం ఉష్ణోగ్రత, తేమను ఎప్పటికప్పుడు పర్యవేక్షించి, ఉల్లి కుళ్ళడం ప్రారంభమైన వెంటనే రైతులకు హెచ్చరికలు జారీ చేస్తుందని తెలిపారు.