బ్యాంకు ఉద్యోగుల ఐదు రోజుల పని దినాల డిమాండ్పై కవిత స్పందన

రిపోర్టర్: ప్రసాద్ స్థలం: నిజామాబాద్

అధిక పనిభారంతో సతమతమవుతున్న బ్యాంకు ఉద్యోగులు ఐదు రోజుల పని దినాల డిమాండ్ అమలు కోసం ఎప్పటినుంచో ఎదురుచూస్తున్నారని కల్వకుంట్ల కవిత వెల్లడించారు. ఉదయం నుంచి కస్టమర్లను డీల్ చేయడంతో పాటు బ్యాక్ ఎండ్ వర్క్, టార్గెట్లు, కరెన్సీ లెక్కలు చూసుకోవడంలో ఉద్యోగుల రోజంతా గడిచిపోతుందని ఆమె పేర్కొన్నారు. చాలామంది రాత్రి వరకు శ్రమిస్తున్నందున వారి సమస్యను పరిష్కరించాలని కోరుతూ కేంద్ర ప్రభుత్వానికి ఆమె విజ్ఞప్తి చేశారు.