పిఠాపురం అభివృద్ధికి 'పాడా'కు స్వయం ప్రతిపత్తి కల్పిస్తూ ఉత్తర్వులు!
రిపోర్టర్: నరేష్
స్థలం: కాకినాడ
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేసింది. పిఠాపురం ప్రాంత అభివృద్ధి అథారిటీ (పాడా)కి స్వయం ప్రతిపత్తి కల్పిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. కాకినాడ జిల్లా కలెక్టర్ అధ్యక్షతన ప్రత్యేక అధికారాలతో పనిచేయనున్న ఈ సంస్థ ద్వారా నిధుల మంజూరు, ప్రాజెక్టుల రూపకల్పన వేగవంతం కానుంది.