వైద్యసేవల్లో తీవ్ర లోపం: ప్రభుత్వ ఆసుపత్రుల్లో అందని ఫిజియోథెరపీ సేవలు

రిపోర్టర్: నరేష్ స్థలం: నెల్లూరు

ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఫిజియోథెరపీ సేవలు అందక రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఎన్సీడీ జిల్లా అధికారి డాక్టర్ అంశుధర్ తెలిపారు. జిల్లాలోని పలు కమ్యూనిటీ హెల్త్ సెంటర్లలో ఫిజియోథెరపిస్ట్ పోస్టులు ఖాళీగా ఉండటంతో పేదలు ప్రైవేటు క్లినిక్లను ఆశ్రయించి ఆర్థికంగా నష్టపోతున్నారని ఆయన వెల్లడించారు. ఖాళీ పోస్టుల భర్తీకి త్వరలోనే ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లి తగిన చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు.