రోడ్డు సమస్యపై విద్యార్థుల ధర్నా ఎమ్మెల్యే డౌన్ డౌన్ అంటూ ఆందోళన
రిపోర్టర్: Alfa News Desk
స్థలం: పెంచికల్పేట్
కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా పెంచికల్పేట్ నుంచి సలుగుపల్లి వరకు రహదారి గుంతలమయంగా మారడంతో ఇబ్బందులు పడుతున్నామని ఆరోపిస్తూ లోడుపల్లి గ్రామానికి చెందిన విద్యార్థులు రోడ్డుపై బైఠాయించి ధర్నా చేపట్టారు. పాఠశాలలకు వెళ్లేందుకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేస్తూ ఎమ్మెల్యే డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. రహదారి సమస్యను పరిష్కరిస్తామని అధికారులు, ప్రజాప్రతినిధులు స్పష్టమైన హామీ ఇచ్చే వరకు ఆందోళన విరమించేది లేదని విద్యార్థులు తెలిపారు.