పెగడపల్లి పోలీస్ స్టేషన్లో ఓపెన్ హౌస్: విద్యార్థులకు ఆధునిక సాంకేతికతపై అవగాహన

రిపోర్టర్: శ్రీనివాస్ స్థలం: జగిత్యాల

పోలీస్ ఫ్లాగ్ డే సందర్భంగా జగిత్యాల జిల్లా పెగడపల్లి పోలీస్ స్టేషన్లో నిర్వహించిన ఓపెన్ హౌస్ కార్యక్రమంలో విద్యార్థులకు పోలీస్ శాఖ అందిస్తున్న సేవలు, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగంపై అవగాహన కల్పించినట్లు ఎస్పీ జగిత్యాల (@spjagtial) వెల్లడించారు. సైబర్ నేరాల నివారణకు తీసుకుంటున్న చర్యలతో పాటు మహిళల రక్షణ కోసం నిరంతరం శ్రమిస్తున్న షీటీం సేవల గురించి విద్యార్థులకు క్షుణ్ణంగా వివరించినట్లు పేర్కొంటూ ఎస్పీ జగిత్యాల ట్వీట్ చేశారు.