భారీ వర్షాల నేపధ్యంలో అధికారులంతా అప్రమత్తంగా ఉండాలని సీఎం రేవంత్ ఆదేశం
రిపోర్టర్: ప్రవీణ్
స్థలం: Hyderabad
హైదరాబాద్ నగరంలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో అధికార యంత్రాంగం పూర్తిస్థాయిలో అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. నగర పరిధిలోని మున్సిపల్ కార్పొరేషన్ల కమిషనర్లు, హైడ్రా, పోలీసు శాఖలు పరస్పర సమన్వయంతో పనిచేస్తూ క్షేత్రస్థాయిలో పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించాలని స్పష్టం చేశారు.