ఆసియా క్రీడల్లో పతకం కోల్పోయిన భారత షూటింగ్ జట్టు

రిపోర్టర్: కృష్ణ స్థలం: న్యూఢిల్లీ

ఆసియా క్రీడల పురుషుల పది మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో భారత షూటర్లు కమల్జీత్, ఆకాశ్ భరద్వాజ్, కేదార్లింగ్ ఉచగాన్వె త్రిసభ్య జట్టు 1727 పాయింట్లతో నాలుగో స్థానంతో సరిపెట్టుకుంది. వ్యక్తిగత ఫైనల్స్కు అర్హత సాధించడంలో విఫలమై పతక ఆశలను గల్లంతు చేసుకున్నారు. చైనా, ఇండోనేషియా, జపాన్ దేశాలు తొలి మూడు స్థానాలను కైవసం చేసుకున్నాయి.