పులివెందులలో విధ్వంసానికి వైకాపా యత్నం: సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం

రిపోర్టర్: కిరణ్ స్థలం: అమరావతి

పులివెందులలో వైకాపా అధినేత జగన్ విధ్వంసం సృష్టించడానికి ప్రయత్నించారని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ధ్వజమెత్తారు. కూటమి పార్టీల నేతలు మరియు పోలీసులను రెచ్చగొట్టేలా ఆయన వ్యవహరించారని చంద్రబాబు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఇలాంటి కుట్రల పట్ల కూటమి శ్రేణులు అత్యంత అప్రమత్తంగా ఉండాలని, సంయమనం పాటించాలని ఆయన సూచించారు. ఎన్నికల నిబంధనలను కచ్చితంగా పాటిస్తూ పోలింగ్ శాతం పెరిగేలా శ్రేణులు కృషి చేయాలని చంద్రబాబు పిలుపునిచ్చారు.