ఉత్తరప్రదేశ్‌లో భార్యలను గొంతు కోసి హతమార్చిన భర్తలు

రిపోర్టర్: కృష్ణ స్థలం: Uttar Pradesh

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో వేర్వేరు ఘటనల్లో ఇద్దరు వ్యకి్తృలు తమ భార్యలను హత్య చేశారు. అబ్దుల్లాపూర్ ప్రాంతానికి చెందిన మనీష్ తన భార్య కవితను గొంతు కోసి చంపి పోలీసు స్టేషన్‌లో లొంగిపోయాడు. మరో ఘటనలో ఫతేహుల్లాపూర్ గ్రామానికి చెందిన చంద్ ఖాన్ ఆస్తి వివాదం కారణంగా భార్య షాహిస్తాను గొంతునులిమి హత్య చేసి పోలీసులకు చిక్కాడు. పోలీసులు ఈ రెండు కేసులను నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.