నవీ ముంబైలో వ్యభిచార ముఠా గుట్టు రట్టు, మైనర్ బాలిక రక్షణ

రిపోర్టర్: సునీల్ స్థలం: మహారాష్ట్ర

నవీ ముంబైలోని నెరూల్ ప్రాంతంలో వ్యభిచార గృహంపై పోలీసులు మెరుపు దాడి చేశారు. నకిలీ కస్టమర్‌ను పంపి వ్యభిచార ముఠా గుట్టును రట్టు చేసిన పోలీసులు, 12 ఏళ్ల మైనర్ బాలికతో పాటు మరో మహిళను రక్షించారు. ఈ కేసులో లాడ్జి మేనేజర్లు, వెయిటర్‌ను అరెస్టు చేశారు. నిందితులపై పోక్సో చట్టం సహా పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి, రిమాండ్‌కు తరలించారు.