రాజన్న సిరిసిల్ల: కొత్తపల్లి సింగిల్ విండో చైర్మన్ పదవిపై తీవ్ర ఉత్కంఠ
రిపోర్టర్: గోపి
స్థలం: రాజన్న సిరిసిల్ల
రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం కొత్తపల్లి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చైర్మన్ పదవి ఎవరికి దక్కుతుందనే అంశంపై స్థానిక రాజకీయాల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొన్నట్లు స్థానిక నాయకులు తెలిపారు. ఈ పదవి కోసం కాంగ్రెస్ పార్టీకి చెందిన దమ్మ శ్రీనివాస్ రెడ్డి, రాజా నర్సింహారెడ్డి తీవ్రంగా పోటీపడుతున్నట్లు సమాచారం. పార్టీ కోసం శ్రమించిన వారికే తగిన గుర్తింపు ఇవ్వాలని పార్టీ శ్రేణులు కోరుతుండటంతో, అధిష్ఠానం ఎవరి వైపు మొగ్గు చూపుతుందనేది సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.