వాట్సాప్ సిమ్ బైండింగ్ నిబంధనలతో విదేశీ ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు తప్పవు
రిపోర్టర్: రమేష్
స్థలం: New Delhi
కేంద్ర టెలికాం శాఖ తీసుకువచ్చిన కొత్త సిమ్ బైండింగ్ నిబంధనల వల్ల వాట్సాప్ వంటి మెసేజింగ్ యాప్స్ వాడే విదేశీ ప్రయాణికులకు తీవ్ర కార్యాచరణ సవాళ్లు ఎదురవుతాయని ఎస్యా సెంటర్ అధ్యయనం స్పష్టం చేసింది. సైబర్ మోసాలను అరికట్టేందుకు ప్రభుత్వం ఈ చర్యలు చేపట్టిందని, అయితే విదేశీ పర్యటనల్ లో ఉన్నప్పుడు ప్రయాణికులు తీవ్ర అసౌకర్యానికి గురికావాల్సి వస్తుందని ఆ నివేదిక పేర్కొంది. వచ్చే జనవరి నుంచి ఈ కొత్త నిబంధనలు అమల్లోకి రానున్నాయి.