దారుణం: వివాహేతెర సంబంధం అనుమానంతో భార్యను సజీవ దహనం చేసిన భర్త

రిపోర్టర్: మహేష్ స్థలం: కన్నౌజ్

ఉత్తరప్రదేశ్ లోని కన్నౌజ్ జిల్లాలో అత్యంత అఘాయిత్యం చోటుచేసుకుంది. వివాహేతర సంబంధం పెట్టుకుందనే అనుమానంతో ముప్ పై ఏళ్ల సోనమ్ అనే మహిళను ఆమె భర్త సుక్బీర్ సింగ్ కుర్చీకి కట్టేసి పెట్రోలు పోసి నిప్పంటించి హత్య చేసినట్లు స్థానిక పోలీసులు వెల్లడించారు. ఈ ఘోర ఘటన అనంతరం నిందితుడు తన ఇద్దరు కుమారులతో పరారీ అయ్యాడని, అతడిని పట్టుకునేందుకు ప్రత్యేక పోలీసు బృందాలు గాలింపు చర్యలు ముమ్మరం చేశాయని అధికారులు తెలిపారు.