ఖానాపూర్ ఎమ్మెల్యే బొజ్జు పటేల్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన అదనపు కలెక్టర్
రిపోర్టర్: Gangadhar Reporter
స్థలం: జన్నారం
ఉట్నూర్‌లోని ఖానాపూర్ శాసనసభ్యులు వెడ్మ బొజ్జు పటేల్ నివాసంలో నిర్మల్ జిల్లా నూతన అదనపు కలెక్టర్‌గా నియమితులైన వెంకట మాధవ్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వెంకట మాధవ్‌కు శుభాకాంక్షలు తెలియజేస్తూ, నూతన బాధ్యతల్లో ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తూ జిల్లా అభివృద్ధికి కృషి చేయాలని ఆకాంక్షించారు.