వెంకటాచలం అభివృద్ధిపై చర్చకు సిద్ధమా?
నెల్లూరు జిల్లా వెంకటాచలం లో పనులు చేసింది ఎవరు....ప్రజల సొత్తు దోచుకున్నది ఎవరో తేల్చుకుందామా
అభివృద్ధి వెంకటశేషయ్య ఆస్తుల్లో మాత్రమే కనిపిస్తోంది..అర ఎకరా నుంచి 50 ఎకరాల భూములు, కోట్ల ఆస్తికి ఎదిగాడు
వెంకటాచలంలో మీడియాతో టీడీపీ నాయకులు సండి రమేష్, ఉప్పు అశోక్, యనమల రాజేంద్ర
2014 నుంచి జెడ్పీటీసీ, సర్పంచ్ పదవులను అడ్డుపెట్టుకుని వెంకటశేషయ్య అక్రమంగా దోచేశాడు
భార్య సర్పంచ్ పదవిని అడ్డుపెట్టుకుని తన అకౌంట్ లో రూ.కోటికి పైగా పంచాయతీ సొత్తు జమ చేయించుకున్నాడు
ఆ కోటి రూపాయలు ఎక్కడ ఖర్చు పెట్టారో చూపించగలరా
వెంకటశేషయ్య అధికార దుర్వినియోగం పుణ్యాన అనేక మంది అధికారులు సస్పెండ్ అయ్యారు
శవ రాజకీయాలు చేస్తున్నదే వెంకటశేషయ్య...ఆ రొచ్చులోకి గోవర్ధన్ రెడ్డిని కూడా లాగాడు
వెంకటశేషయ్య రాసిచ్చిన స్ర్కిప్టులు చదివి కాకాణి అభాసుపాలయ్యాడు
జగనన్న పేరుతో వేసిన లేఅవుట్ లో ఎన్ని ప్లాట్లు వేశారు..ఎవరికి ఇచ్చారు..వారిలో స్థానికేతరులు ఎంతమంది..
అమాయకులకు ప్లాట్లు అమ్మి సొమ్ము చేసుకున్నాడు..ఉద్యోగాల పేరుతో అనేక మంది అమాయకులను ముంచేశాడు
కూటమి ప్రభుత్వం వచ్చాక పంచాయతీ పరిధిలో జరిగిన అభివృద్ధిని చూపించేందుకు మేం సిద్ధంగా ఉన్నాం
రూ.1.50 కోట్లతో సోలార్ వీధిలైట్లు వేయించాం
రైలు కట్టకింద ఎస్టీ కాలనీతో పాటు పంచాయతీ పరిధిలోని అనేక కాలనీల్లో తాగునీటి అవసరాలు తీర్చేందుకు బోర్లు వేయించాం
ఇందిరమ్మ కాలనీలో ఆర్వో ప్లాంటు ఏర్పాటు చేయిస్తుంటే మందల తన అనుచరులతో అనేక అడ్డంకులు సృష్టించాడు
వెంకటాచలంలో అభివృద్ధి వెంకటశేషయ్య ఆస్తుల్లోనే కనిపిస్తోంది..అర ఎకరా నుంచి 50 ఎకరాల భూములు, కోట్లాది రూపాయల ఆస్తులకు ఎదిగాడు
హైవే పరిధిలో ఉన్న డ్రైన్ మరమ్మతుల విషయంలో చెత్త రాజకీయాలు చేయడం కూడా ఆయనకే చెల్లింది
రూ.కోటికి పైగా పంచాయతీ సొత్తు అక్రమంగా తినేసి జిల్లాలోనే వెంకటాచలం పరువు తీసేశాడు
సీతమ్మ చలివేంద్రం భూములు దేవాదాయ శాఖవా...ప్రభుత్వానికి సంబంధించినవా వైసీపీ నేతలే చెప్పాలి
వెంకటాచలం ప్రజలు చాలా తెలివైన వారు...త్వరలో జరగబోయే పంచాయతీ ఎన్నికల్లో వెంకటశేషయ్యకు బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారు