తెలంగాణలో ఇప్పట్లో మంత్రివర్గ విస్తరణ లేదు: మహేష్ కుమార్ గౌడ్

రిపోర్టర్: కృష్ణ స్థలం: తెలంగాణ

తెలంగాణలో మంత్రివర్గ విస్తరణపై వస్తున్న వార్తలను టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఖండించారు. దిల్లీలో దీనిపై ఎలాంటి చర్చ జరగలేదని, విస్తరణ ఎప్పుడు చేయాలనేది సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయమని స్పష్టం చేశారు. కొండా సురేఖ విషయంలో అధిష్ఠానం కఠినంగా వ్యవహరించిందని తెలిపారు. కుల సర్వేపై కేంద్రం తీరును తప్పుబట్టిన మంత్రి పొన్నం ప్రభాకర్, ఓబీసీల జనాభా లెక్కలపై కేంద్రాన్ని నిలదీశారు.