తిరుమల శ్రీవారి దర్శనాల్లో సామాన్య భక్తులకే అధిక ప్రాధాన్యత: డిప్యూటీ ఈవో భాస్కర్
రిపోర్టర్: కిరణ్
స్థలం: తిరుమల
శ్రీవారి దర్శనాల్లో సామాన్య భక్తులకే అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు ఆలయ డిప్యూటీ ఈవో బయ్యాల భాస్కర్ తెలిపారు. తిరుమలలో మీడియాతో మాట్లాడుతూ, నవరాత్రి బ్రహ్మోత్సవాలలో అందరికీ దర్శనం కల్పించేందుకు పలు ప్రత్యేక దర్శనాలను రద్దు చేశామని పేర్కొన్నారు. తొలి రెండు రోజుల్లో దాదాపు లక్షా అరవై ఎనిమిది వేల మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారని వెల్లడించారు. భక్తుల రద్దీకి అనుగుణంగా రోజుకు తొమ్మిది లక్షల లడ్డూలను అందుబాటులో ఉంచామని ఆయన స్పష్టం చేశారు.