టైసన్ నాయుడు అప్డేట్: నవంబర్ ఆరున ఫస్ట్ సింగిల్ విడుదల
రిపోర్టర్: అశోక్
స్థలం: హైదరాబాద్
టాలీవుడ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నటిస్తున్న తాజా సినిమా టైసన్ నాయుడు నుంచి మేకర్స్ కీలక అప్డేట్ ప్రకటించారు. సాగర్ కె చంద్ర దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ యాక్షన్ ఎంటర్టైనర్ సినిమా ఫస్ట్ సింగిల్ మదరాసిరబ్బరు బొమ్మ పాటను నవంబర్ ఆరున విడుదల చేయబోతున్నట్లు చిత్రయూనిట్ వెల్లడించింది. ఈ మాస్ సాంగ్ తో సినిమా మ్యూజికల్ జర్నీ ప్రారంభం కానుందని, భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నారని నిర్మాతలు తెలిపారు.