రాళ్లదొడ్డిలో స్వచ్ఛాంధ్ర కార్యక్రమం స్వచ్ఛత ప్రతిజ్ఞ చేసిన ప్రజాప్రతినిధి

రిపోర్టర్: AMPAIAH ACHARI స్థలం: ఎమ్మిగనూరు

కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండల పరిధిలోని రాళ్లదొడ్డి గ్రామంలో స్వచ్ఛాంధ్ర–స్వచ్ఛ దివస్ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు, గ్రామ ప్రజలతో కలిసి ప్రజాప్రతినిధులు స్వచ్ఛత ప్రతిజ్ఞ చేశారు. అనంతరం పాఠశాలను పరిశీలించి మౌలిక వసతులు, తాగునీరు, భవన పునర్నిర్మాణంపై అధికారులతో చర్చించారు. ప్రజల సమస్యలను అడిగి తెలుసుకుంటూ సంక్షేమ పథకాల అమలును పరిశీలించారు.