శ్రీనివాసమంగాపురం ఆలయానికి నలభై లక్షల విలువైన వాహనాలు విరాళం

రిపోర్టర్: కృష్ణ స్థలం: తిరుపతి

శ్రీనివాసమంగాపురంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి ఆలయానికి హైదరాబాద్కు చెందిన భక్తులు రూ.40 లక్షల విలువైన బంగారు పూత పూసిన సింహ, గజ వాహనాలను విరాళంగా సమర్పించినట్లు ఆలయ అధికారులు తెలిపారు. దాతలు పీవీ లక్ష్మీ రెడ్డి, పీవీ దివ్య ప్రియాంక ఈ వాహనాలను స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ ఈవో వరలక్ష్మికి అందజేశారు. స్వామివారి బ్రహ్మోత్సవాల్లో వీటిని వినియోగించనున్నట్లు వెల్లడించారు. అనంతరం అర్చకులు వేద మంత్రోచ్ఛారణల మధ్య వాహనాలకు ప్రత్యేక పూజలు నిర్వహించి, దాతలకు దర్శనం కల్పించారు.