గుండె ఆరోగ్యం: జన్యుపరమైన సమస్యలపై నిపుణుల కీలక హెచ్చరికలు

రిపోర్టర్: భాస్కర్ స్థలం: Hyderabad

జీవనశైలితో పాటు జన్యుపరమైన కారణాలు కూడా గుండె జబ్బులకు ప్రధాన కారణమవుతున్నాయని మెడ్జెనోమ్ లాబ్స్ డైరెక్టర్ డాక్టర్ రమేష్ మీనన్ వెల్లడించారు. తల్లిదండ్రుల నుండి సంక్రమించే హై కొలెస్ట్రాల్, గుండె కండరాల సమస్యలు, ఎలక్ట్రికల్ సిగ్నల్ లోపాలు ప్రాణాంతకంగా మారే అవకాశం ఉందని హెచ్చరించారు. కుటుంబంలో గుండె జబ్బుల చరిత్ర ఉన్నవారు ముందస్తుగా వైద్య పరీక్షలు చేయించుకోవడం ద్వారా ముప్పును తగ్గించుకోవచ్చని ఆయన స్పష్టం చేశారు.