గాయకుడు జుబిన్ గార్గ్ కేసులో ఇద్దరు పీఎస్వోలకు బెయిల్ మంజూరు
రిపోర్టర్: నరేష్
స్థలం: Gwahati
దివంగత గాయకుడు జుబిన్ గార్గ్ ఆర్థిక లావాదేవీల కేసుకు సంబంధించి అరెస్టయిన ఇద్దరు వ్యక్తిగత భద్రతా అధికారులకు గౌహతి ప్రత్యేక కోర్టు మంగళవారం బెయిల్ మంజూరు చేసింది. పరేష్ బైష్య, నందేశ్వర్ బోరా అనే పీఎస్వోల తరఫు న్యాయవాదులు వాదనలు వినిపించగా కోర్టు ఈ నిర్ణయం తీసుకుంది. అయితే జుబిన్ గార్గ్ మృతికి సంబంధించిన మరో కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్నందున, వీరు తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు జైల్లోనే ఉండాల్సిన పరిస్థితి నెలకొంది.