హైదరాబాద్‌లో సేవా సంకల్ప్ అభియాన్: ప్రధాని మోదీ సేవలకు ఘన నివాళి
రిపోర్టర్: ప్రవీణ్
స్థలం: హైదరాబాద్
ప్రధాని నరేంద్ర మోదీ సుదీర్ఘ ఇరవై ఐదు సంవత్సరాల నిరంతర ప్రజా సేవను పురస్కరించుకుని నిర్వహిస్తున్న సేవా సంకల్ప్ అభియాన్ కార్యక్రమంలో కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి ప్రత్యేకంగా పాల్గొన్నారు. హైదరాబాద్‌లోని బర్కత్‌పురాలో ఉన్న భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో ఈ వేడుక అత్యంత ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ప్రధాని మోదీ దేశానికి అందిస్తున్న సేవలను, ఆయన నాయకత్వంలో సాధించిన విజయాలను గుర్తుచేస్తూ పార్టీ శ్రేణులు ఉత్సాహంగా ఈ కార్యక్రమంలో పాలుపంచుకున్నాయని కిషన్ రెడ్డి తెలిపారు.