భూ రీ సర్వే పనులను వేగవంతంగా పూర్తి చేయాలని కలెక్టర్ అంకిత్ ఆదేశం
రిపోర్టర్: మహేష్
స్థలం: భద్రాద్రి కొత్తగూడెం
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపహాడ్ మండలంలోని పినపాక పట్టీనగర్ రెవెన్యూ పరిధిలో అంజనాపురం ప్రాంతంలో జరుగుతున్న డిజిటల్ భూ రీ సర్వే పనులను శనివారం జిల్లా కలెక్టర్ అంకిత్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో చేపడుతున్న సర్వే పురోగతిని తాసీల్దార్ కేఆర్కే ప్రసాద్‌ను అడిగి తెలుసుకున్నారు. నిర్దేశిత లక్ష్యాలకు అనుగుణంగా సర్వేను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు.