కల్వకుర్తి ఎత్తిపోతల పరిశీలనలో కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రుల ఆగ్రహం

రిపోర్టర్: ప్రసాద్ స్థలం: నాగర్ కర్నూల్

తెలంగాణ రైతులకు సాగునీరు ఇవ్వకుండా కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని మాజీ మంత్రులు సి.లక్ష్మారెడ్డి, నిరంజన్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్ తీవ్రంగా మండిపడ్డారు. నాగర్ కర్నూల్ జిల్లాలోని కల్వకుర్తి ఎత్తిపోతల పథకం, గుడిపల్లి రిజర్వాయర్‌ను వారు పరిశీలించారు. ఆంధ్రాకు నీళ్లు తరలిస్తున్నా తెలంగాణ రైతులకు మాత్రం మొండిచెయ్యి చూపుతున్నారని విమర్శించారు. మోటార్లు సరిగా నడపకపోవడంతో పంటలు ఎండిపోయే పరిస్థితి వచ్చిందని ఆందోళన వ్యక్తం చేశారు.